కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత

2 Sep, 2018 12:14 IST|Sakshi

సౌతాంప్టన్‌: ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఒక సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన మూడో భారత ఫీల్డర్‌గా రాహుల్‌ గుర్తింపు సాధించాడు. నాల్గో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో భాగంగా శనివారం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్ అలిస్టర్ కుక్ (12) క్యాచ్‌తో పాటు మొయిన్ అలీ (9) క్యాచ్‌‌లను స్లిప్‌లో కేఎల్ రాహుల్ అందుకున్నాడు.

ఇన్నింగ్స్ 12.1వ ఓవర్‌లో బుమ్రా వేసిన బంతిని ఎదుర్కొన్న కుక్‌(12) స్లిప్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 15.4వ ఓవర్‌లో ఇషాంత్‌ శర్మ వేసిన బంతిని ఎదుర్కొన్న మొయిన్‌ అలీ(9) కేఎల్‌ రాహుల్‌కే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో 11 క్యాచ్‌లు పట్టిన రాహుల్‌.. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు.   2004లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ మొత్తం 13 క్యాచ్‌లను అందుకుని అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సోల్కర్ 12 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు