నబీ తర్వాతే కోహ్లి..

19 Sep, 2019 13:20 IST|Sakshi

మొహాలీ: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఫార్మాట్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన ఘనత అఫ్గాన్‌ది. ఒకటి కాదు.. రెండు సార్లు వరుస అత్యధిక విజయాలు సాధించింది. ఈ క‍్రమంలోనే తన రికార్డునే తానే బ్రేక్‌ చేసుకుంది అఫ్గాన్‌. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్‌పై 25 పరుగుల తేడాతో గెలిచిన అఫ్గాన్‌ కొత్త చరిత్ర లిఖించింది. టీ20ల్లో వరుసగా 12వ విజయాన్ని  నమోదు చేసింది. 2018 ఫిబ్రవరిలో అంతర్జాతీయ టీ20ల్లో  జైత్రయాత్రను ఆరంభించిన అఫ్గాన్‌ ఇప్పటివరకూ ఒక్క పరాజయాన్ని కూడా చూడలేదు. అంతకుముందు 2016-17 సీజన్‌లో వరుస 11  టీ20 విజయాల్ని ఖాతాలో వేసుకుంది అఫ్గాన్‌. దాంతో తన పేరిట ఉన్న రికార్డును సవరించుకుంది.

కాగా, అఫ్గాన్‌ గెలుపులో మహ్మద్‌ నబీది కీలక పాత్ర. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో  నబీ అజేయంగా 84  పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికంగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకూ అఫ్గాన్‌ తరఫున టీ20ల్లో 12సార్లు నబీ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు దక్కించుకున్నాడు.  ఇది ఓవరాల్‌గా అత్యుత్తమం. కాగా, ఆ తర్వాత స్థానంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కొనసాగుతున్నాడు. టీ20ల్లో భారత్‌ తరఫున కోహ్లి 11సార్లు మాత్రమే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అజేయంగా 72 పరుగులు సాధించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును కోహ్లి సొంతం చేసుకున్నాడు. ఈ క‍్రమంలోనే పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ల అవార్డులను కోహ్లి సమం చేశాడు. అఫ్రిది తన టీ20 కెరీర్‌లో పాక్‌ తరఫున 11 సందర్భాల్లో ఈ అవార్డు దక్కించుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా