విరాట్‌ ఎవ్వరికీ అందనంత ఎత్తులో

22 Oct, 2019 10:40 IST|Sakshi

రాంచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా భారత కెప్టెన్‌గా విరాట్‌ తన విజయాల శాతాన్ని మరింత పెంచుకున్నాడు. ప్రధానంగా దక్షిణాఫ్రికాపై కోహ్లి నేతృత్వంలోని భారత్‌ 10 టెస్టులు ఆడగా అందులో ఏడు విజయాల్ని నమోదు చేసింది. దాంతో సఫారీలపై కోహ్లి విజయాల శాతం 70గా నమోదైంది. కాగా, ఇక్కడ మిగత భారత కెప్టెన్లకు అందనంత ఎత్తులో నిలిచాడు కోహ్లి. మిగతా అంతా కలిసి సఫారీలపై 29 టెస్టులు ఆడగా విజయాల శాతం 24.14 గా ఉంది. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాపై భారత్‌ ఇప్పటివరకూ ఆడిన టెస్టులు 39. 

ఇక చాలాకాలం పాటు నిషేధం ఎదుర్కొని దక్షిణాఫ్రికా తిరిగి క్రికెట్‌ను ఆరంభించిన తర్వాత మూడు అంతకంటే పైగా టెస్టుల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ కావడం మూడోసారి మాత్రమే. గతంలో 2001-02 సీజన్‌లో ఆసీస్‌పై ఆస్ట్రేలియాలో 0-3తేడాతో సఫారీలు సిరీస్‌ కోల్పోగా, అటు తర్వాత ఆసీస్‌పై దక్షిణాఫ్రికాలో 0-3తో సిరీస్‌ను చేజార్చుకున్నారు. 14 ఏళ్ల తర్వాత సఫారీలు మరోసారి క్లీన్‌స్వీప్‌ అయ్యారు. భారత్‌ పర్యటనకు ఎంతో ఉత్సాహంతో వచ్చిన సఫారీలు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ అయ్యి తిరిగి వెళుతున్నారు.

మూడు టెస్టుల సిరీస్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్‌ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో విజయం సాధించింది.కేవలం భారత్‌లో సఫారీలతో ఒక్క సిరీస్‌ను మాత్రమే కోల్పోయిన టీమిండియా తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. మంగళవారం నాల్గో రోజు ఆటలో భాగంగా 132/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా మరో ఒక పరుగు మాత్రమే సాధించి ఆలౌటైంది. కేవలం 12 బంతుల్లోనే చివరి రెండు వికెట్లను నదీమ్‌ తీయడంతో దక్షిణాఫ్రికాకు ఘోర ఓటమి, భారత్‌కు భారీ విజయం దక్కాయి. ఇది దక్షిణాఫ్రికాకు ఓవరాల్‌గా నాల్గో అతి పెద్ద ఓటమి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా