విరుష్క దీపావళీ సెలబ్రేషన్‌ పిక్చర్స్‌

28 Oct, 2019 10:41 IST|Sakshi

ముంబై: దాదాపు రెండేళ్ల క్రిత వివాహ బంధంతో ఒక్కటైన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలు దీపావళి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం దీపావళి రావడంతో ఆ పండుగను అనుష్కతో కలిసి ఘనంగా జరుపుకున్నాడు కోహ్లి. తన ఇంటిని అందంగా ముస్తాబు చేసుకుని దీపాలతో వెలుగులు నింపాడు. 

మరొకవైపు అనుష్కతో కలిసి ఫోజిచ్చిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘ మీకు, మీ కుటుంబానికి మా దీపావళి శుభాకాంక్షలు’ అంటూ కోహ్లి కొన్ని ఫోటోలను షేర్‌ చేశాడు. అదే సమయంలో అనుష్క శర్మ కూడా తన ట్వీటర్‌ అకౌంట్‌లో మరికొన్ని ఫోటోలను పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా