ఆధిక్యం దిశగా టీమిండియా

20 Aug, 2018 17:54 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ భారీ ఆధిక్యం దిశగా దూసుకపోతోంది.  టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, పరుగుల యంత్రం పుజారాలు అర్థసెంచరీలతో చెలరేగారు. మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 124/2తో ఆట ఆరంభించిన భారత్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లి-పుజారా బ్రిటీష్‌ బౌలర్లకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఇం‍గ్లండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డును పరిగెత్తించారు. మూడో రోజు లంచ్‌ విరామం వరకు టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కోహ్లి సేన ఇప్పటివరకు 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం పుజారా (56 నాటౌట్‌; 7 ఫోర్లు), కోహ్లి(54 నాటౌట్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

కోహ్లి-పుజారాల క్లాస్‌ ఇన్నింగ్స్‌
మూడో రోజు ఆట కోనసాగించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కోహ్లి-పుజారాలు ఆచితూచి ఆడుతున్నారు. పదేపదే ఇంగ్లండ్‌ సారథి జోయ్‌ రూట్‌ బౌలింగ్‌ మారుస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కొంది. టీమిండియా సారథి తన ఫామ్‌ను కొనసాగిస్తూ రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్థసెంచరీ సాధించాడు. గత కొద్ది రోజులుగా ఫామ్‌లో లేక నానాతంటాలు పడుతున్న పుజారా తిరిగి పునర్వైభవం అందుకున్నాడు. తన దైన క్లాస్‌ షాట్‌లతో ఆకట్టుకున్నాడు.   

మరిన్ని వార్తలు