కోహ్లి, రోహిత్‌ల విధ్వంసం.. అంపైర్‌ సాయం కోరిన ఫించ్

10 Jun, 2020 16:27 IST|Sakshi

లండన్‌: టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మలు ఇద్దరూ కలిసి బ్యాటింగ్‌ చేస్తుంటే ఫ్యాన్స్‌కు ఎంత మజా వస్తుందో అంతకంటే ఎక్కువగా ప్రత్యర్థి జట్టులో గుబులు మొదలవుతుంది. ఒక్కసారి వీరిద్దరూ క్రీజుల పాతుకపోతే బౌండరీల వర్షం.. పరుగుల వరద ఖాయం. అలా వీరిద్దరూ ఎంతో మంది ప్రత్యర్థి బౌలర్లకు, కెప్టెన్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చారు. అయితే గతంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌లు విధ్వంసం సృష్టిస్తుంటే ఏం చేయాలో పాలుపోని సారథి ఫించ్‌ అంపైరింగ్‌ చేస్తున్న మైకేల్‌ గాఫ్‌ సలహా కోరాడు. ఈ విషయాన్ని స్థానిక మాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైకేల్‌ గాఫ్‌ బయటపెట్టాడు. (‘కోహ్లిలా ఆడాలి.. పాక్‌ను గెలిపించాలి’)

‘భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఒకటి గుర్తొస్తోంది. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌లు బాగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. భారీ భాగస్వామ్యం దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ సమయంలో స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఫించ్‌ పక్కన అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. ఈ ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మన్‌ ఆట చూడకుండా ఉండేదెలా? వారిద్దరికి నేనెలా బౌలింగ్‌ చేయించాలి? అని సలహా కోరాడు. అప్పుడు నాకు పని ఉంది. నీ పని నువ్వు చూసుకో’ అని జవాబిచ్చినట్లు ఆనాటి మ్యాచ్‌ విశేషాలను గాఫ్‌ గుర్తుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంగ్లండ్‌కు చెందిన మైకేల్‌ గాఫ్‌ 62 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశాడు. ('ఆరోజు రితికా అందుకే ఏడ్చింది')

మరిన్ని వార్తలు