‘టై’లో కూడా కోహ్లి మార్కు

25 Oct, 2018 12:31 IST|Sakshi

విశాఖపట్నం: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి శకం నడుస్తోంది. వరుస రికార్డులతో దూసుకుపోతున్న కోహ్లి.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో తనదైన ఆటతీరుతో చెలరేగిపోయాడు. విండీస్‌తో మ్యాచ్‌లో భారీ శతకం సాధించిన కోహ్లి.. వన్డే ఫార్మాట్‌లో పదివేల పరుగుల మైలురాయిని అందుకుని తక్కువ ఇన‍్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి అజేయంగా 157 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడంతో భారత జట్టు 321 పరుగుల స్కోరును నమోదు చేసింది.

అయితే అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ సరిగ్గా 321 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. కాగా, టైగా ముగిసిన వన్డేల పరంగా చూస్తే అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. వన్డే ఫార్మాట్‌లో టైగా ముగిసిన మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ స్ట్రాస్‌(158) తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత కోహ్లిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

విశాఖ సమరం సమం 

దస్‌ హజార్‌ సలామ్‌! 

10,000

మరిన్ని వార్తలు