ఇది క్రికెట్‌లో అధ్వానం: కోహ్లి

10 Aug, 2019 10:13 IST|Sakshi

ప్రావిడెన్స్‌ (గయానా): వెస్టిండీస్‌తో తొలి వన్డే జరిగిన తీరుపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి చిర్రెత్తుకొచ్చినట్లుంది. మ్యాచ్‌లు ఆగుతూ, సాగే పరిస్థితి క్రికెట్‌లో అధ్వానం అని, ఆటగాళ్లు గాయాల పాలయ్యే ప్రమాదం ఉందని అతడు తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశాడు. తొలి వన్డేను తొలుత 43 ఓవర్లకు తర్వాత 34 ఓవర్లకు కుదించినా మళ్లీ మళ్లీ వాన రావడంతో చివరకు రద్దు చేశారు. దీనిపై మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడాడు. ఇలాంటి సందర్భాలు కొన్నిసార్లు పరీక్షకు గురిచేస్తాయన్నాడు. ఇది క్రికెట్‌లో చాలా అధ్వానమని పేర్కొన్నాడు. కరీబియన్‌ దీవుల్లోని పిచ్‌ల స్వభావం పైనా అతడు స్పందించాడు. కొన్ని పేస్, బౌన్స్‌కు సహకరిస్తే, మరికొన్ని స్లోగా ఉంటాయని పేర్కొన్నాడు. వాటిని అంచనా వేసి అందుకుతగ్గట్లు ఆడాల్సి ఉంటుందని వివరించాడు.   

మరిన్ని వార్తలు