విరాట్‌ కోహ్లికి గాయం!

15 Aug, 2019 14:03 IST|Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గాయపడ్డాడు.  విండీస్‌ నిర్దేశించిన టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కీమర్‌ రోచ్‌ వేసిన 27 ఓవర్‌లో కోహ్లి కుడి చేతి వేలికి గాయమైంది. అయితే ఫిజియోతో ప్రాథమిక చేయడంతో బ్యాటింగ్‌ను కొనసాగించిన కోహ్లి సెంచరీ సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే గాయం కావడంతో విండీస్‌తో తొలి టెస్టుకు కోహ్లి దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.

దీనిపై స్పందించిన కోహ్లి తన వేలికి గాయమైన విషయం వాస్తవమేనని, కాకపోతే అది అంత తీవ్ర గాయం కాదని పేర్కొన్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో ఆడతానని స్పష్టం చేశాడు. ‘ అదృష్టవశాత్తూ వేలికి ఫ్రాక్చర్‌ కాలేదు. దాంతోనే నేను తిరిగి బ్యాటింగ్‌ కొనసాగించా. ఒకవేళ ఫ్రాక్చర్‌ అయ్యుంటే బ్యాటింగ్‌ చేయలేకపోయేవాడిని. అది చిన్నపాటి గాయమే. నేను బంతిని హిట్‌ చేసే క్రమంలో అది చేతి వేలికి తాకింది. తొలి టెస్టు ఆడటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అని కోహ్లి పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు