విరాట్‌ కోహ్లి మరో రికార్డు

27 Dec, 2018 14:28 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనతను సాధించాడు. విదేశాల్లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరిట ఉంది. 2002లో విదేశీ గడ్డపై ద్రవిడ్‌ 1137 పరుగులు చేశాడు. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆసీస్‌తో జరుగుతున్న టెస్టులో భాగంగా కోహ్లి విదేశాల్లో 1138 పరుగులు చేశాడు.  విదేశాల్లో అత్యధిక పరుగుల చేసిన భారత క్రికెటర్ల జాబితాలో మొహీందర్‌ అమర్‌నాథ్‌ (1065), సునీల్ గావస్కర్‌ (918)లు కోహ్లి, ద‍్రవిడ్‌ల తర్వాత స్థానాల్లో ఉన్నారు.

ఇక టెస్టులో కోహ్లీ వ్యక్తిగతంగా మరో మైలురాయినీ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 81 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఫలితంగా తన టెస్టు కెరీర్‌లో అత్యధిక పరుగుల్ని ఆసీస్‌పైనే సాధించిన రికార్డును అందుకున్నాడు. తన టెస్టు కెరీరల్‌లో ఆసీస్‌ జట్టుమీద ఇప్పటివరకూ 1581 పరుగులు చేసిన కోహ్లి.. ఇంగ్లండ్‌పై 1570 పరుగులు, శ్రీలంకపై 1004 పరుగులు చేశాడు.

భారత్‌ స్కోరు 443/7.. ఇన్నింగ్స్‌ డిక్లేర్

మరిన్ని వార్తలు