కోహ్లీ అవుట్

15 Feb, 2015 12:43 IST|Sakshi

అడిలైడ్: సెంచరీ హీరో విరాట్ కోహ్లీ (107) అవుటయ్యాడు. సొహైల్ ఖాన్ బౌలింగ్లో కోహ్లీ కీపర్ ఉమర్ అక్మల్కు క్యాచిచ్చాడు. వన్డేల్లో విరాట్ 22వ సెంచరీ నమోదు చేశాడు. ప్రపంచ కప్ గ్రూప్-బిలో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కోహ్లీ సెంచరీ, ధవన్ హాఫ్ సెంచరీతో పాటు రైనా రెచ్చిపోవడంతో భారత్ వేగంగా పరుగులు రాబడుతోంది. ప్రస్తుతం రైనా, ధోనీ బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ 47 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది.

 

మరిన్ని వార్తలు