'కోహ్లితో చాలా బాగుంది'

7 Sep, 2017 14:25 IST|Sakshi
'కోహ్లితో చాలా బాగుంది'

కొలంబో: శ్రీలంక పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి పని చేయడం ఒక సంతోషాన్ని కల్గించిందని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పష్టం చేశారు. అటు టెస్టు సిరీస్ నుంచి మొదలుకొని, చివరి ట్వంటీ 20 మ్యాచ్ వరకూ చూస్తే కోహ్లి తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడని కుల్దీప్ పేర్కొన్నారు. ఒక కెప్టెన్ బౌలర్ కు స్వేచ్ఛనివ్వడంతో ఎటువంటి ఒడిదుడికులు లేకుండా బౌలింగ్ చేసినట్లు తెలిపారు.

'విరాట్ ఒక నాయకుడు. మనం ఫీల్డ్ లో ఏమి చేయాలని అనుకుంటున్నామో అదే చేయమనే స్వేచ్ఛనిస్తాడు. ప్రధానంగా కోహ్లి వద్ద బౌలర్లకు విపరీతమై స్వేచ్ఛ ఉంటుంది. నేను ఎప్పుడైతే బౌలింగ్ చేస్తానో, అప్పుడు విరాట్ నా వద్దకు వచ్చి ఫ్రీగా బౌలింగ్ చేయమని చెబుతారు. బౌలర్లకు స్వేచ్ఛ నివ్వడంలో మాపై ఒత్తిడి ఉండదు.

మమ్ముల్ని ముందుండి విరాట్ నడిపించే తీరు నిజంగా అమోఘం. అటు బ్యాట్ తోనూ, ఇటు ఫీల్డింగ్ లోనూ విరాట్ ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. విరాట్ తో పాటు జట్టు సమష్టి కృషి కూడా బాగుంది'అని కుల్దీప్ అన్నారు. ఓవరాల్ గా లంకేయులతో ద్వైపాక్షిక సిరీస్ లో తన ప్రదర్శన ఒక కొత్త అనుభూతిని తీసుకొచ్చిందన్నారు.