తొలిరోజు భారత్ అదరహో

18 Nov, 2016 07:42 IST|Sakshi
తొలిరోజు భారత్ అదరహో
విశాఖపట్టణం: ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో ఆతిధ్య భారత జట్టు అదరగొడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 317 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పటిష్ట స్ధితిలో నిలిచింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు లోకేష్ రాహుల్(0), మురళీ విజయ్(20)లు శుభారంభాన్ని అందించలేకపోయినా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర పుజారా(119), కెప్టెన్ విరాట్ కోహ్లీ(151)లు సెంచరీలతో అదరగొట్టారు. 
 
పుజారా ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే(23) కూడా త్వరగా ఔటయ్యాడు. తొలి రోజు ఆట మరో పదిహేను నిమిషాల్లో ముగుస్తుందనగా రహానే వెనుదిరగడం భారత్ కు దెబ్బే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(1)తో జతకలిసిన కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్టువర్ట్ బ్రాడ్ కు ఒక వికెట్ దక్కింది. బెన్ స్టోక్స్, జాఫర్ అన్సారీ, అదిల్ రషీద్, మొయీన్ అలీలు పెద్ద సంఖ్యలో ఓవర్లు సంధించినా వికెట్లను పడగొట్టలేకపోయారు.
మరిన్ని వార్తలు