చికెన్‌ బర్గర్‌ను ఫుల్‌గా లాగించేసిన కోహ్లి!

2 Dec, 2019 16:25 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేవి అతని రికార్డులతో పాటు ఫిట్‌నెస్‌ కూడా. తన ఆటకు కోహ్లి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.. ఫిట్‌నెస్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాడు కోహ్లి.  పొరపాటున కూడా డైట్‌ను తప్పకూడదనే యోచనలో ఉంటాడు. ఏది పడితే అది తినకుండా అత్యంత నియమావళితో కూడిన ఆహారాన్ని మాత్రమే కోహ్లి తీసుకుంటాడు. అది కోహ్లి ఫిట్‌నెస్‌ రహస్యం. ఫిట్‌నెస్‌ విషయంలో కోహ్లిని చాలా మంది క్రికెటర్లు ఫాలో అవుతున్నారంటే మరి అతను ఎంత కఠోర సాధన చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. అయితే మనకు తెలియన విషయం ఒకటి ఉంది. ఒకానొక సందర్భంలో చికెన్‌ బర్గర్‌ను చూసి కోహ్లి ఆగలేకపోయాడట. దాన్ని ఫుల్‌గా లాగించేశాడట.

ఈ విషయాన్ని తాజాగా కోహ్లి ఒక ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.  ‘2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో నేను 235 పరుగులు చేశా. నేను గేమ్‌ ఉన్న రోజున ఎక్కువగా తినను. కేవలం అరటి పండు-మంచి నీళ్లు మాత్రమే తీసుకుంటా. కానీ అప్పటి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శంకర్‌ బసూ బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఈ రాత్రి మీరు ఏమైనా తినొచ్చు అని అన్నాడు. మీకిష్టమైంది తినమని చెప్పాడు. దాంతో నేను చికెన్‌ బర్గర్‌ ఆర్డర్‌ ఇచ్చా. 

అప్పటికి నేను మాంసం తింటున్నాను. ఒక బన్‌ను ఓపెన్‌ చేశా. ఇక ఆగలేకపోయా. ఆపకుండా తినేశా. ఆ తర్వాత ఒక పీస్‌ బ్రెడ్‌ లాగించేశా. మరొకవైపు పెద్ద ప్లేట్‌లో ఉన్న ఫ్రై కూడా తినేశా. ఆపై చాకోలెట్‌ షేక్‌ను కూడా తీసుకున్నా.  ఎందకంటే నా శరీరానికి అవన్నీ అవసరమని తెలుసు’ అని కోహ్లి పేర్కొన్నాడు.కాగా, గత కొన్నేళ్ల నుంచి మాత్రం ఆహారం విషయంలో కఠినమైన నిబద్ధతతో ఉంటున్నాడు. దాంతో పాటు ఫిట్‌నెస్‌కు సంబంధించిన వర్కౌట్లు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాడు.  దీనికి సంబంధించి ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియలో షేర్‌ చేసుకుంటూ ఉంటాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా