‘ఇగో’తో విరాట్‌ కోహ్లి!

24 Aug, 2019 14:58 IST|Sakshi

ఆంటిగ్వా: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏం చేసినా ఆసక్తికరమే అన్నట్లు మారిపోయింది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించినా, ఫీల్డ్‌లో దూకుడును ప్రదర్శించినా అది హాట్‌ టాపిక్‌ అయిపోతుంది. అయితే తాజాగా కోహ్లి చేతిలో ఉన్న పుస్తకం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. పుస్తకం చదివితే ఆసక్తికరం ఏమిటా అనుకుంటున్నారా.. అది ఇగోకు సంబంధించిన బుక్‌ కాబట్టే ఇప్పుడు వార్త అయ్యింది. కోహ్లికి అహం పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో  స్టీవెన్‌ సిల్వస్టర్‌ రాసిన  ‘డిటాక్స్‌ యువర్‌ ఇగో: 7 ఈజీ  స్టెప్స్‌ ఈజీ టు ఎచీవింగ్‌ ఫ్రీడమ్‌’ అనే పుస్తకం అతని చేతిల్లో కనిపించడం వైరల్‌ అయ్యింది. వెస్టిండీస్‌తో సర్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో తొలి టెస్టు జరుగుతున్న సమయంలో భారత్‌ ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ పుస్తకాన్ని దీక్షగా చదువుతూ కనిపించాడు.

దీనిపై సోషల్‌ మీడియాలో భిన్నరకాలుగా స్పందిస్తున్నారు క్రికెట్‌ ఫ్యాన్స్‌. ‘ ఇగో టైటిల్‌ ఉన్న పుస్తకాన్ని కోహ్లి చదువుతున్నాడు చూశారా’ అని ఒక అభిమాని పేర్కొనగా, ‘ బుక్‌ పేరు డిటాక్స్‌ యువర్‌ ఇగో’ అని మరొక అభిమాని తెలిపాడు. ‘ చివరకు కోహ్లికి డిటాక్స్‌ యువర్‌ ఇగో అనే పుస్తకం అవసరమైంది’ అని మరొకరు చమత్కరించారు. ‘ టీమిండియా కోచ్‌ పదవి కోసం పోటీపడ్డ మైక్‌ హెసన్‌ చివరికి ఆర్సీబీ డైరక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ పదవీ పగ్గాలు చేపట్టనున్నాడని ఈ పుస్తకం చదువుతున్నావా’ అని ఒక అభిమాని సెటైర్‌ వేశాడు.

మరిన్ని వార్తలు