అయ్యర్‌ కాస్త ఆగు.. ఏంటా తొందరా!

19 Dec, 2019 20:12 IST|Sakshi

కోల్‌కతా: వెస్టిండీస్‌ జరిగిన రెండో వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌ నుంచి వచ్చిన ఇన్నింగ్స్‌ చిరస్మరణీయం. నాల్గో స్థానంలో తానే సరైన వాడినని చెబుతూనే బ్యాట్‌ ఝుళిపించిన తీరు అమోఘం. ఒక ఓవర్‌లో రిషభ్‌ పంత్‌తో కలిసి 31 పరుగులు సాధించాడు అయ్యర్‌. రోస్టన్‌ ఛేజ్‌ వేసిన 47 ఓవర్‌లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టాడు అయ్యర్‌. దాంతో భారత్‌ తరఫున వన్డేల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును అయ్యర్‌-పంత్‌లు నమోదు చేశారు. కాగా, కీమో పాల్‌ వేసిన తదుపరి ఓవర్‌ రెండో బంతికి సింగిల్‌ తీసిన అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తైందని భావించి ముందుగానే బ్యాట్‌ పైకి ఎత్తాడు.

అప్పటికి అయ్యర్‌ వ్యక్తిగత స్కోరు 49. కాగా దీనిని స్టేడియంలో కూర్చొని గమనించిన విరాట్‌ కోహ్లి వెంటనే స్పందించాడు. ‘అరే అయ్యర్‌ కాస్త ఆగు.. ఏంటా తొందరా’ అనే అర్థం వచ్చేలా చేతితో సైగలు చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో అయ్యర్‌ 32 బంతుల్లో 4 సిక్సర్లు,3 ఫోర్లతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు.  రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌ సెంచరీలతో పాటు అయ్యర్‌-పంత్‌లు  ధాటిగా ఆడటంతో భారత్‌ 387 పరుగులు  చేసింది. ఆపై విండీస్‌ 280 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు