చాంపియన్స్ లీగ్ ఫైనల్: చెన్నై విజయలక్ష్యం 181

4 Oct, 2014 21:49 IST|Sakshi
చాంపియన్స్ లీగ్ ఫైనల్: చెన్నైవిజయలక్ష్యం 181

బెంగళూర్: చాంపియన్స్ లీగ్ లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా కోల్ కతాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతాకు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప(39; 32బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), గౌతం గంభీర్(80;52 బంతుల్లో 7 ఫోర్లు,3సిక్సులు)లు శుభారంభాన్నిచ్చారు. అనంతరం జాక్వస్ కల్లిస్ (1) పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

 

చివర్లో యూసఫ్ పఠాన్(20),మనీష్ పాండే(32) పరుగులు చేయడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 180పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నేగీ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకోగా, రవీంద్ర జడేజాకు ఒక వికెట్టు లభించింది.

మరిన్ని వార్తలు