కృష్ణతేజకు రజతం సుప్రీతకు కాంస్యం

10 Apr, 2016 01:10 IST|Sakshi
కృష్ణతేజకు రజతం సుప్రీతకు కాంస్యం

సాక్షి, హైదరాబాద్: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు రాణించారు. అండర్-18 బాలికల విభాగంలో పొట్లూరి సుప్రీత... అండర్-18 ఓపెన్ విభాగంలో ఎన్.కృష్ణతేజ రజతం సాధించారు. మంగోలియాలో జరిగిన ఈ పోటీల్లో సుప్రీత ఐదు పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. సుప్రీత ఐదు గేముల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. సుప్రీత కెరీర్‌లో ఇది ఏడో అంతర్జాతీయ పతకం కావడం విశేషం.

భారత్‌కే చెందిన వి.వర్షిణి (తమిళనాడు) ఆరు పాయింట్లతో ఈ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు కృష్ణతేజ 5.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కృష్ణతేజ ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని... ఒక గేమ్‌లో ఓడిపోయాడు. అండర్-14 బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నూతక్కి ప్రియాంక ఆరో స్థానంలో, బొమ్మిని మౌనిక అక్షయ ఎని మిదో స్థానంలో, అండర్-16 బాలికల విభాగంలో జి.హర్షిత ఐదో స్థానంలో నిలిచారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు