చెన్నై లక్ష్యం 166

7 Apr, 2018 21:58 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ ఆదిలోనే ఎవిన్‌ లూయిస్‌ వికెట్‌ను నష్టపోయింది. జట్టు స్కోరు ఏడు పరుగుల వద్ద లూయిస్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి రోహిత్‌ శర్మ(15) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం ఇషాన్‌ కిషాన్‌(40;29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(43;29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు ఆకట్టుకోవడంతో ముంబై తేరుకుంది. వీరిద్దరూ 78 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో వికెట్‌గా అవుటయ్యాడు.

మరో 15 పరుగుల వ్యవధిలో ఇషాన్‌ కిషాన్‌ కూడా ఔట్‌ కావడంతో స్కోరును ముందుకు తీసుకెళ్లే బాధ్యత కృనాల్‌ పాండ్యా-హార్దిక్‌ పాండ్యాలు తీసుకున్నారు.  ఈ క‍్రమంలోనే కృనాల్‌(41 నాటౌట్‌;22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌(22 నాటౌట్‌; 20 బంతుల్లో 2 ఫోర్లు)లు అజేయంగా 52 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.  చెన్నై బౌలర్లలో షేన్‌ వాట్సన్‌ రెండు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌లకు తలో వికెట్‌ దక్కింది.
 

మరిన్ని వార్తలు