కుల్దీప్‌ ఇన్‌.. చహల్‌ ఔట్‌

10 Feb, 2019 12:22 IST|Sakshi

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ సేన

న్యూజిలాండ్‌ తరఫున బ్లెయిర్‌ టిక్‌నెర్‌ అరంగేట్రం

హామిల్టన్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. చహల్‌ స్థానంలో కుల్దీప్‌ తుది జట్టులోకి వచ్చాడు. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేజింగ్‌కే మొగ్గు చూపాడు. ‘ఇది బౌలింగ్‌ అనుకూలించే పిచ్‌ కనుక మేం ఫీల్డింగ్‌ ఎంచుకున్నాం. ఇక్కడ గత మ్యాచ్‌లో మేం ఘోరపరాభావాన్ని చవిచూశాం. ఇదో పెద్ద గేమ్‌. చేజింగ్‌లో మాకు మంచి రికార్డుంది. మా జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. చహల్‌ స్థానంలో కల్దీప్‌ తుది జట్టులోకి వచ్చాడు.’  అని టాస్‌ సందర్భంగా రోహిత్‌ పేర్కొన్నాడు.

ఇక ఆతిథ్య జట్టులో కూడా స్వల్ప మార్పు చోటు చేసుకుంది. కివీస్‌ తరఫున బ్లెయిర్‌ టిక్‌నెర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఈ మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశాడు. ఫెర్గూసన్‌ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుని ఈ పర్యటనను ఘనంగా ముగించాలని రోహిత్‌ సేన ఉవ్విళ్లూరుతుండగా.. కివీస్‌ మాత్రం టీ20 సిరీస్‌ నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

తుది జట్టు: 
భారత్‌:
రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, పంత్, విజయ్‌ శంకర్, ధోని, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్ 

న్యూజిలాండ్‌: సీఫెర్ట్, మున్రో, విలియమ్సన్, రాస్‌ టేలర్, మిషెల్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సౌతీ, సోధి, టిక్నెర్‌. 

మరిన్ని వార్తలు