కుల్దీప్‌ రికార్డుల మోత..!

12 Jul, 2018 22:32 IST|Sakshi
కుల్దీప్‌ యాదవ్‌

నాటింగ్‌హామ్‌: భారత చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు కొరకరాని కొయ్యగా మిగిలిన కుల్దీప్‌(6/25) ఆతిథ్య జట్టును మరోసారి దెబ్బతీశాడు. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో అదరగొట్టిన ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా కుల్దీప్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. 

వన్డేల్లో ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గానూ అరుదైన ఘనత సాధించాడు. వన్డేలో బ్రిటీష్‌ పిచ్‌లపై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కుల్దీప్‌ సరికొత్త రికార్డు లిఖించాడు. ఒక​ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్‌ చైనామన్‌ బౌలర్‌ బ్రాడ్‌ హాగ్‌ రికార్డును తిరగరాశాడు. టీమిండియా తరుపున​ బౌలింగ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌గా మరో ఘనత సాధించాడు. గతంలో అనిల్‌ కుంబ్లే(6/12), అమిత్‌ మిశ్రా(6/48), మురళీ కార్తీక్‌(6/27)లు ఈ ఘనత సాధించారు. ఈ ఫీట్‌ సాధించచిన నలుగురు బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం.

,

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘తెలియక తప్పు చేశా..నరకం చూశా’

భారత్‌ సాయం కోరిన అక్తర్‌

ఇదేం పని జోన్స్‌.. ట్రోల్‌ చేసిన ఆకాష్‌

ఐపీఎల్‌ కోసం ఆశగా..

రవిశాస్త్రి ‘ట్రేసర్‌ బుల్లెట్‌’ వైరల్‌..!

సినిమా

నా పేరుపై సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతా: నటుడు

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు

ఒక్కసారి ఒరిజినల్‌ సాంగ్‌ వినండి: రెహమాన్‌

క్యాస్టింగ్‌ కౌచ్‌: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా!