టీమిండియాలో కొత్త కుర్రాడు అరంగేట్రం!

7 Feb, 2017 17:17 IST|Sakshi
టీమిండియాలో కొత్త కుర్రాడు అరంగేట్రం!

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టులో టీమిండియా సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆడటం లేదు. టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్న మిశ్రాను మోకాలి గాయం బాధిస్తోంది. ఇంగ్లండ్ తో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ మిశ్రా ఇంకా కోలుకోలేదు.  గురువారం నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభంకానున్న ఏకైక టెస్టు నుంచి అతడికి విశ్రాంతి ఇచ్చారు. జట్టులో అశ్విన్, రవీంద్ర జడేజాలు ఆఫ్ స్పిన్నర్లు ఉన్నందున గాయపడ్డ మిశ్రా స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ తుది జట్టులో అవకాశం లభించనుంది.

కుల్దీప్ యాదవ్ టెస్టు అరంగేట్రం
సీనియర్ స్పిన్నర్ మిశ్రా గాయం కారణంగా యువ బౌలర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో యువ బౌలర్ కుల్దీప్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కుల్దీప్ 1/32, 2/2 ప్రదర్శన చేశాడు. 22 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన కుల్దీప్ 33.11 సగటుతో 81 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ ల్లో 5వికెట్ల ప్రదర్శనతో కుల్దీప్ ఆకట్టుకున్నాడు. మరోవైపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అతని సహచరులు సన్నాహాలు మొదలుపెట్టారు. మ్యాచ్‌ వేదికైన ఉప్పల్‌ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు