2015 వరల్డ్ కప్ తర్వాత సంగక్కర నిష్ర్కమణ!

17 Mar, 2014 19:27 IST|Sakshi

ఢాకా: మరోవైపు టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన కుమార సంగక్కర 2015 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు వెల్లడించాడు. ఆ సమయానికి తాను 37 ఏళ్లకు చేరుకుంటాను కాబట్టి కొనసాగలేనని, ఇది సహజ పరిణామమని అతను స్పష్టం చేశాడు. ఇప్పటికే ట్వంటీ20 ల నుంచి రిటైర్ తీసుకుంటున్నటున్నట్లు జయవర్ధనే,  సంగక్కరలు ప్రకటించారు.  ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు మహేల సోమవారం ప్రకటించాడు.  సంగక్కర రిటైర్మెంట్ ప్రకటన తర్వాతి రోజే జయవర్ధనే ఇది చెప్పడం విశేషం.
 
 

శ్రీలంక జట్టు టి20 విజయాల్లో సంగక్కర, జయవర్ధనే కీలక పాత్ర పోషించారు. టి20ల్లో రెండో అత్యుత్తమ భాగస్వామ్యం (166) సంగక్కర-జయవర్ధనే జోడి పేరిటే ఉంది.  సంగక్కర సారథ్యంలో శ్రీలంక 2009 ప్రపంచ కప్ ఫైనల్లో... జయవర్ధనే కెప్టెన్సీలో 2012 ప్రపంచ కప్ ఫైనల్లో పరాజయం పాలైంది.
 

మరిన్ని వార్తలు