సమాధానం లేని ప్రశ్నలెన్నో? 

31 May, 2020 01:29 IST|Sakshi

టి20 ప్రపంచ కప్‌ నిర్వహణపై సంగక్కర

ముంబై: ప్రస్తుత పరిస్థితుల మధ్య టి20 ప్రపంచ కప్‌ నిర్వహణ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారిందని శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంగక్కర అన్నాడు. కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రతీ రోజు కొత్త సమస్యలు ముందుకు వస్తున్నాయని అతను అన్నాడు. క్రికెట్‌ నిబంధనలు రూపొందించే ప్రతిష్టాత్మక మెరిలిబోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)కి అధ్యక్షుడిగా కూడా సంగక్కర వ్యవహరిస్తున్నాడు. ‘ప్రపంచ కప్‌ నిర్వహణ గురించి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను చూస్తే ఈ ఏడాదికి టోర్నీని రద్దు చేయడం, వాయిదా వేయడం వంటివి ఉన్నాయి. మనకు ఇంకా సమాధానం లభించని ప్రశ్నలు చాలా ఉన్నాయి. కరోనా వైరస్‌ ఎప్పటి వరకు ఉంటుంది?  దానితో కలిసి బతకడం  అలవాటు చేసుకోవాలా? అదే జరిగితే మున్ముందు చాలా మార్పులు వస్తాయి. వీటన్నింటిపై ఇప్పుడు మనకు ఎవరు స్పష్టతనిస్తారు. ఐసీసీ కూడా నిపుణుల అభిప్రాయం తీసుకోవాల్సిందే’ అని సంగక్కర వ్యాఖ్యానించాడు. 

మరిన్ని వార్తలు