కుమార సంగక్కర అరుదైన రికార్డు!

11 Mar, 2015 19:06 IST|Sakshi
కుమార సంగక్కర అరుదైన రికార్డు!

నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా.. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ పోతున్నాడు శ్రీలంక బ్యాట్స్మన్ కుమార సంగక్కర. తాజాగా స్కాట్లండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టడంతో కెరీర్ చివరి అంకంలో కూడా మరో కొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ సాధించనట్లుగా.. వరుసగా నాలుగు మ్యాచ్లలో నాలుగు సెంచరీలు కొట్టాడు. ఇప్పటివరకు ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. స్కాట్లండ్పై 124 పరుగులు బాదడంతో ఈ రికార్డు సంగక్కర పేరుమీద నమోదైపోయింది. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 104, ఇంగ్లండ్పై 117 నాటౌట్, బంగ్లాదేశ్పై 105 నాటౌట్.. ఇలా వరుసపెట్టి నాలుగు మ్యాచ్లలోను నాలుగు సెంచరీలు కొట్టాడు.

అలాగే ప్రపంచకప్లో కూడా ఏ బ్యాట్స్మన్ అయినా ఈ ఫీట్ సాధించడం ఇదే తొలిసారి. సంగక్కరకు ముందు ఆరుగురు బ్యాట్స్మన్ వరుసగా మూడేసి మ్యాచ్లలో సెంచరీలు కొట్టారు గానీ నాలుగో మ్యాచ్లో కొట్టలేకపోయారు. వాళ్లు.. జహీర్ అబ్బాస్, సయీద్ అన్వర్ (పాక్), హెర్ష్లీ గిబ్స్, ఏబీ డివీలియర్స్, క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్ (న్యూజిలాండ్). ఇక ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్తో సంగక్కర 14వేల పరుగులు కూడా పూర్తిచేశాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్మన్ కూడా సంగక్కరే.

>
మరిన్ని వార్తలు