మూడో రౌండ్‌లో కుషాల్, వివేక్

17 Sep, 2016 10:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బోడెపూడి శ్రీకాంత్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో కుషాల్, వివేక్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం జిల్లా టీటీ సంఘం, గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారుు. క్యాడెట్ బాలుర విబాగంలో శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో జి. వివేక్ సారుు (హెచ్‌వీఎస్) 11-9, 7-11, 11-6, 11-6తో తరుణ్ యాదవ్ (స్టాగ్ అకాడమీ)పై గెలుపొందగా... గ్లోబల్ టీటీ అకాడమీకి చెందిన కుషాల్ 11-7, 7-11, 11-9, 11-7తో అగస్త్య (ఎల్‌బీఎస్)ను ఓడించాడు.

 

ఇతర మ్యాచ్‌ల్లో త్రిశూల్ మెహ్రా (ఎల్‌బీఎస్) 13-11, 8-11, 11-8, 10-12, 11-8తో వరుణ్ అమర్‌నాథ్ (జీఎస్‌ఎం)పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-4, 11-7, 11-8తో ఆయూష్  (ఏడబ్ల్యుఏ)పై, ప్రకీత్ (ఏడబ్ల్యుఏ) 11-7, 15-13, 7-11, 11-8తో శ్రేష్ట్ (ఏడబ్ల్యుఏ)పై, జతిన్ (ఎస్‌పీహెచ్‌ఎస్) 11-6, 11-9, 11-5తో క్షితిజ్ మల్పానీ (హెచ్‌వీఎస్)పై, వేణు మాధవ్ (జీఎస్‌ఎం) 11-8, 11-9, 12-10తో ఇషాంత్ (ఏడబ్ల్యుఏ)పై గెలుపొందారు. మరోవైపు సబ్ జూనియర్ విభాగంలో రఘురామ్, ఆయూష్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలిరౌండ్‌లో రఘురామ్ (నల్గొండ) 11-4, 11-8, 11-9తో శ్రేష్ట్ (ఏడబ్ల్యుఏ)పై, ఆయూష్ (ఏడబ్ల్యుఏ) 11-9, 6-11, 11-7, 11-2తో హర్ష్ భట్నాగర్‌పై విజయం సాధించారు. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి పి. ప్రకాశ్‌రాజు పాల్గొన్నారు.

 

 సబ్ జూనియర్ బాలుర తొలి రౌండ్
 
 ఫలితాలు: కుషాల్ (జీటీటీఏ) 11-7, 11-5తో రాఘవ్ (హెచ్‌వీఎస్)పై, రాజు (ఏడబ్ల్యుఏ) 11-2, 11-2, 11-2తో మణి (వరంగల్)పై, శ్రేయస్ (హెచ్‌వీఎస్) 11-9, 13-11, 9-11, 13-11తో అథర్వ (ఏడబ్ల్యుఏ)పై, రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-4, 12-10, 11-5తో ప్రీతమ్ (నల్గొండ)పై, విశాల్ (జీఎస్‌ఎం) 11-4, 11-8, 11-3తో రిత్విక్ రోషన్ (వరంగల్)పై, ఆర్య భట్ (హెచ్‌వీఎస్) 11-8, 11-9, 14-12తో ప్రకేత్ (ఏడబ్ల్యుఏ)పై, శ్రీరంగ (హెచ్‌వీఎస్) 11-5, 11-4, 13-11తో నిత్యన్ రెడ్డి (నల్గొండ)పై, సారుునాథ్ రెడ్డి (హెచ్‌వీఎస్) 11-2, 11-1, 11-2తో మహేశ్(ఆదిలాబాద్)పై, ఆగస్త్య (ఎల్‌బీఎస్) 11-9, 13-11, 9-11, 11-3తో హితేన్ సారుు (ఎస్‌పీహెచ్‌ఎస్)పై, ఇషాంత్ (ఏడబ్ల్యుఏ) 11-3, 11-6, 11-5తో మధుకర్ (ఆదిలాబాద్)పై, ప్రణవ్ (ఏడబ్ల్యుఏ) 11-0, 11-1, 11-1తో చక్రవర్తి (వరంగల్)పై విజయం సాధించారు.

మరిన్ని వార్తలు