స్టేడియం బయట ఇషాంత్ లంచ్..

21 Dec, 2014 00:39 IST|Sakshi
స్టేడియం బయట ఇషాంత్ లంచ్..

భోజన ఏర్పాట్లపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు భోజనం విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గాబా టెస్టు మూడో రోజున శాకాహార భోజనం లేకపోవడంతో పేసర్ ఇషాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ మధ్యలో మైదానం బయటకు వెళ్లి తినాల్సి వచ్చింది. అంతకు ముందు లంచ్ మెనూలో తమకు కావాల్సిన భోజనం లేకపోవడంతో ఇషాంత్‌తోపాటు సురేశ్ రైనా కూడా నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వీరు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి, ఐసీసీ ఏసీఎస్‌యూ అధికారితో కలిసిబయటి నుంచి ఆహారం తెచ్చుకున్నారు. అయితే బయటి నుంచి స్టేడియంలోనికి ఫుడ్ అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు.
 
  దీంతో చేసేది లేక ఇషాంత్, రైనా ఇద్దరూ స్టేడియం బయట తమ భోజనాన్ని కానిచ్చారు. సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంలోనూ తమకు ఇచ్చిన మెనూపై భారత జట్టు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆ సమయంలో హ్యూస్ మరణంతో అంతటా విషాదం నెలకొనడంతో ఫిర్యాదు చేయలేకపోయింది. అడిలైడ్ టెస్టుకు భారత చెఫ్‌ను ఏర్పాటు చేసి మంచి భోజనమే అందించినా బ్రిస్బేన్‌లో మాత్రం పట్టించుకోలేదు.
 

మరిన్ని వార్తలు