చెస్‌ విజేతలు లక్ష్మి, ధ్రువ్‌

4 Aug, 2019 10:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (డీఎస్‌ఈ, అత్తాపూర్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్‌ స్కూల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో లక్ష్మీ సమిరాజ్‌ (భారతీ విద్యాభవన్, జూబ్లీహిల్స్‌), ధ్రువ్‌ (సికింద్రాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌) ఆకట్టుకున్నారు.  సీనియర్స్‌ విభాగంలో ధ్రువ్‌ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మోక్షజ్ఞ (గౌతమి విద్యాక్షేత్ర), బి. అఖిల్‌ (డీపీఎస్‌), హైదర్‌ (డీఎస్‌ఈ, అత్తాపూర్‌) వరుసగా తర్వాతి స్థానాలను సాధించారు.

జూనియర్స్‌ కేటగిరీలో లక్ష్మి అగ్రస్థానాన్ని దక్కించుకోగా.... బి. ధ్రువన్‌ రెడ్డి (డీపీఎస్‌) రన్నరప్‌గా నిలిచాడు. ఫోనిక్స్‌ గ్రీన్స్‌కు చెందిన ఆదిత్య సాయి, కెన్నడీ విద్యాభవన్‌ ప్లేయర్‌ శ్రీవర్ష వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 39 పాఠశాలలకు చెందిన మొత్తం 256 మంది విద్యార్థులు పాల్గొన్నారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు