జింబాబ్వే కోచ్‌గా భారత మాజీ ఆటగాడు

24 Aug, 2018 20:56 IST|Sakshi
టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌లో రాజ్‌పుత్‌ (ఫైల్‌ ఫోటో)

క్రికెట్‌ పసికూన జింబాబ్వే జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆటగాడు, కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం జింబాబ్వేకు తాత్కాలిక కోచ్‌గా ఉన్న రాజ్‌పుత్‌ను పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్టు జింబాబ్బే క్రికెట్‌ బోర్డ్‌ ట్వీట్‌ చేసింది. ‘రాజ్‌పుత్‌ సేవలు జింబాబ్వే జట్టు వినియోగించుకోనుంది. అతని అనుభవం, కష్టపడేతత్వం, ఆటపై ఉన్న మక్కువ మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది.

ఇక కోచ్‌గా నియమిచండం పట్ల రాజ్‌పుత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘నన్ను కోచ్‌గా నియమించింనందుకు జింబాబ్వే క్రికెట్‌ బోర్డుకు ధన్యవాదాలు. దీన్ని గౌరవంగా, ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాను. జట్టును మరో లెవల్‌కు తీసుకవెళ్లడానికి కృషి చేస్తాను. త్వరలోనే జింబాబ్వే ఆటలో మార్పులు చూస్తారు’ అంటూ రాజ్‌పుత్ పేర్కొన్నారు. వన్డే వరల్డ్ కప్‌కు జింబాబ్వే జట్టు అర్హత సాధించకపోవడంతో కోచ్‌గా ఉన్న హీత్‌స్ట్రీక్‌ను తప్పించి రాజ్‌పుత్‌ను తాత్కాలిక కోచ్‌గా బోర్డు నియమించిన విషయం తెలిసిందే. 2007లో దక్షిణాఫ్రిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న టీమిండియాకు రాజ్‌పుత్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరించారు. భారత్ తరపున 2 టెస్ట్‌లు, 4 వన్డేలు ఆడిన రాజ్‌పుత్ 2016లో అఫ్గనిస్థాన్ కోచ్‌గా పనిచేశారు.

మరిన్ని వార్తలు