'వరల్డ్ అథ్లెటిక్స్' ఫైనల్స్లోకి లలితా బాబర్

24 Aug, 2015 11:08 IST|Sakshi
'వరల్డ్ అథ్లెటిక్స్' ఫైనల్స్లోకి లలితా బాబర్

చైనా రాజధాని బీజింగ్లో జరుగుతున్న 15వ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో భారత అథ్లెట్లు ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. సోమవారం ఉదయం జరిగిన 3 వేల మీటర్ల స్టీఫెల్చేజ్ ఈవెంట్లో స్టార్ అథ్లెట్ లలితా బాబర్ జాతీయ రికార్డును బద్దలుకొట్టి ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈ పోటీలో నాలుగో స్థానంలో నిలిచిన లిలత.. 9:27:86 నిమిషాల్లో లూప్స్ను పూర్తిచేశారు.

ఈరోజు సాయంత్రం 6:45 (భారత కాలమానం ప్రకారం) గంటలకు ఫైనల్స్ పోటీలు ప్రారంభమవుతాయి. ఆదివారం జరిగిన షాట్పుట్ త్రో ఫైనల్స్లో మన అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ నిరాశపర్చినప్పటికీ, పాల్గొన్న మొదటి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లోనే ఫైనల్స్కు చేరుకున్న మొట్టమొదటి భారత షాట్ పుటర్ గా ఆయన చరిత్ర సృష్టించారు. 20 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్ లో భారత అథ్లెట్ బల్జీందర్ సింగ్ 12 వస్థానంలో నిలవడం కూడా విశేషమే.

మరిన్ని వార్తలు