మహిళా అంపైర్‌గా కొత్త చరిత్ర

24 Oct, 2019 12:33 IST|Sakshi

కేప్‌టౌన్‌: గత నెలలో ముగిసిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో పాటు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ వుమెన్స్‌ క్రికెటర్‌ లారెన్‌ ఏజెన్‌బాగ్‌.. ఇప్పుడు పురుషుల ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్నారు. దక్షిణాఫ్రికా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌కు లారెన్‌ను అంపైర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. దాంతో పురుషుల ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌కు ఎంపికైన తొలి మహిళా అంపైర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

దక్షిణాఫ్రికాలో స్టాండర్డ్‌ మహిళా అంపైర్‌గా తన బాధ్యతలు నిర్వర్తిసున్న లారెన్‌పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు తాత్కాలిక డైరెక్టర్‌ కోరీ వాన్‌ జిల్‌ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే తన ప్రతిభను ప్రపంచానికి చూపించిన లారెన్‌ తన అంకితం భావంతో మరిన్ని కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. మిగతా మహిళా క్రికెటర్లకు ఆమె ఒక స్ఫూర్తిగా నిలిచిపోతుందని కోరీ వాన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఐసీసీ మహిళా అంపైర్ల ప్యానల్‌లో సభ్యురాలిగా ఉన్న లారెన్‌.. వరల్డ్‌ టీ20లో క్వాలిఫయర్‌  మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు.

మరిన్ని వార్తలు