చాంపియన్‌ లక్ష్మణ్‌

14 Sep, 2019 09:56 IST|Sakshi

ఆలిండియా ఓపెన్‌ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: పెరల్‌ సిటీ ఆలిండియా ఓపెన్‌ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఐసీఎఫ్‌ గ్రాండ్‌మాస్టర్‌ లక్ష్మణ్‌ రాజారామ్‌ సత్తా చాటాడు. స్థానిక మారుతి గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో లక్ష్మణ్‌ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఓపెన్‌ కేటగిరీలో నిరీ్ణత 11 రౌండ్ల అనంతరం 9 పాయింట్లను సాధించిన అతను మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం కోసం పోటీపడ్డాడు. అయితే మెరుగైన టైబ్రేక్‌  స్కోర్‌ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా లక్ష్మణ్‌ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్‌ కార్తికేయన్‌ (ఐసీఎఫ్‌; 9 పాయింట్లు), ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ ముత్తయ్య (తమిళనాడు; 9 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు. లక్ష్మణ్‌ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 గేముల్లో గెలుపొందాడు.

మరో 4 గేమ్‌లను ‘డ్రా’గా ముగించి టోరీ్నలో అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన లక్ష్మణ్‌ రూ. 50,000 ప్రైజ్‌మనీతో పాటు ఆల్టో 800 కారును బహుమతిగా అందుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన కార్తికేయన్‌ రూ. 30,000 ప్రైజ్‌మనీ, ద్విచక్రవాహనాన్ని గెలుచుకోగా... మూడోస్థానంలో నిలిచిన ముత్తయ్య ల్యాప్‌టాప్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమానాన్ని సొంతం చేసుకున్నాడు. మొత్తం 300 మంది చెస్‌ ప్లేయర్లు తలపడిన ఈ టోరీ్నలో తెలంగాణకు చెందిన ప్రణీత్‌ 8.5 పాయింట్లతో 12వ స్థానంలో, శిబి శ్రీనివాస్‌ 8 పాయింట్లతో 22వ స్థానంలో, జె. వెంకట రమణ 7.5 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచారు. శుక్రవారం టోర్నీ ముగింపు కార్యక్రమంలో డీఎస్‌పీ వంశీమోహన్‌ రెడ్డి, శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, ఖ్యాతి ఫౌండేషన్‌ చైర్మన్‌ వి. భవాని పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు