హైదరాబాద్‌కు ఆధిక్యం

31 Dec, 2014 01:23 IST|Sakshi
హైదరాబాద్‌కు ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌లో 338 ఆలౌట్  
సర్వీసెస్ రెండో ఇన్నింగ్స్ 96/4  
రంజీ ట్రోఫీ మ్యాచ్

సాక్షి, హైదరాబాద్: సర్వీసెస్ బౌలర్లు పుంజుకున్నప్పటికీ... హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తమవంతుగా రాణించడంతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 210/3తో మంగళవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ మిగతా ఏడు వికెట్లను 128 పరుగులకు కోల్పోయింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది.

‘సెంచరీ హీరో’ విహారి ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం ఐదు పరుగులు జోడించి అవుటయ్యాడు. అయితే వికెట్ కీపర్ ఇబ్రహీమ్ ఖలీల్ (91 బంతుల్లో 4 ఫోర్లతో 34)... చివర్లో స్పిన్నర్లు ఆకాశ్ భండారి (53 బంతుల్లో 6 ఫోర్లతో 36 నాటౌట్), మెహదీ హసన్ (51 బంతుల్లో 4 ఫోర్లతో 26) బాధ్యతాయుతంగా ఆడటంతో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

సర్వీసెస్ బౌలర్లలో సౌరభ్ కుమార్ నాలుగు వికెట్లు, సకూజా మూడు వికెట్లు తీసుకున్నారు. 32 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్వీసెస్ మూడో రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. ప్రస్తుతం సర్వీసెస్ 64 పరుగులతో ముందంజలో ఉంది. ఆట చివరిరోజు బుధవారం సర్వీసెస్‌ను 200 పరుగులలోపు ఆలౌట్ చేస్తే హైదరాబాద్‌కు ఈ మ్యాచ్‌లో విజయావకాశాలున్నాయి.
 
స్కోరు వివరాలు
సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్: 306; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) యశ్‌పాల్ సింగ్ (బి) సౌరభ్ కుమార్ 35, అక్షత్ రెడ్డి (సి) దేవేందర్ (బి) రోషన్ రాజ్ 0, విహారి (సి) యశ్‌పాల్ సింగ్ (బి) సౌరభ్ కుమార్ 119, రవితేజ (సి) ప్రతీక్ (బి) రోషన్ రాజ్ 32, అనిరుధ్ (సి) యశ్‌పాల్ సింగ్ (బి) రోషన్ రాజ్ 31, అహ్మద్ ఖాద్రీ (ఎల్బీడబ్ల్యూ) (బి) సకూజా 2, ఇబ్రహీమ్ ఖలీల్ (సి) ప్రతీక్ దేశాయ్ (బి) సౌరభ్ కుమార్ 34, ఆశిష్ రెడ్డి (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌరభ్ కుమార్ 15, ఆకాశ్ భండారి (నాటౌట్) 36, మెహదీ హసన్ (సి) పూనియా (బి) సకూజా 26, రవి కిరణ్ (బి) సకూజా 0, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (132 ఓవర్లలో ఆలౌట్) 338
వికెట్ల పతనం: 1-0, 2-74, 3-157, 4-221, 5-224, 6-241, 7-272, 8-284, 9-337, 10-338.
బౌలింగ్: సూరజ్ యాదవ్ 14-2-57-0, రోషన్ రాజ్ 16-4-37-3, సౌరభ్ కుమార్ 42-12-92-4, సకూజా 28-8-61-3, దీపక్ పూనియా 19-1-65-0, యశ్‌పాల్ సింగ్ 3-1-6-0, రజత్ పలివాల్ 5-0-12-0, ప్రతీక్ దేశాయ్ 5-0-5-0.
 
సర్వీసెస్ రెండో ఇన్నింగ్స్: ప్రతీక్ దేశాయ్ (సి) ఖలీల్ (బి) ఆకాశ్ భండారి 16, సౌమిక్ చటర్జీ (సి) ఖలీల్ (బి) రవి కిరణ్ 9, నకుల్ వర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్ భండారి 21, రజత్ పలివాల్ (సి) రవి కిరణ్ (బి) మెహదీ హసన్ 20, దేవేందర్ (బ్యాటింగ్) 20, యశ్‌పాల్ సింగ్ (బ్యాటింగ్) 6, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (34 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 96
వికెట్ల పతనం: 1-21, 2-29, 3-56, 4-75; బౌలింగ్: రవి కిరణ్ 8-3-18-1, ఆశిష్ రెడ్డి 2-0-11-0, ఆకాశ్ భండారి 13-1-40-2, మెహదీ హసన్ 9-2-19-1, అహ్మద్ ఖాద్రీ 1-1-0-0, రవితేజ 1-0-4-0.

>
మరిన్ని వార్తలు