ఆఫ్‌ స్పిన్నర్లకు లెగ్‌ స్పిన్‌ అదనపు బలం 

25 Apr, 2018 01:27 IST|Sakshi

 ‘బర్త్‌ డే బాయ్‌’ సచిన్‌

ముంబై: ఆఫ్‌ స్పిన్నర్‌కు అప్పుడప్పుడు లెగ్‌ బ్రేక్స్‌ వేయగల సత్తా ఉంటే అది అదనపు బలమవుతుందని ‘బర్త్‌ డే బాయ్‌’ సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. 45వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న అతను మీడియాతో ముచ్చటించాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన అశ్విన్‌ ఇటీవల సందర్భాన్ని బట్టి లెగ్‌ బ్రేక్స్‌ వేస్తున్నాడు. దీనిపై సచిన్‌ మాట్లాడుతూ ‘వైవిధ్యమనేది ఇక్కడ ఆయుధమవుతుంది. ఎలాగంటే ఒకరికి రెండు, మూడు భాషలు బాగా తెలుసు. అయితే అతడు మరో నాలుగైదు భాషలు నేర్చుకుంటే మంచిదే. బహుభాష కోవిదుడవుతాడు. ఇక్కడ పరిజ్ఞానం పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. అలాగే స్పిన్నర్లు వైవిధ్యం చూపగలిగితే వారి అమ్ములపొదిలోని అస్త్రాలు పెరుగుతాయి.

అంతేగానీ అలా వేయడం తప్పు అనడం సమంజసం కాదు. ఇది బంతులు సంధించడంలో పురోగమనంగానే భావించాలి తప్ప... దోషంగా చూడకూడదు. ఇలాంటి దురభిప్రాయాల్నే మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఆఫ్‌ స్పిన్నర్లు దూస్రాలతో పాటు గూగ్లీలు వేస్తే తప్పేంటి. దీన్ని ఎందుకు కాదనాలి’ అని అన్నాడు.  మారుతున్న కాలంతో పాటే క్రికెట్‌ కూడా మారుతోందన్నాడు. 1991, 92లోనే ఐపీఎల్‌ వచ్చివుంటే తన ఆట అలాగే ఉండేదన్నాడు. ఐపీఎల్‌నే చూసుకుంటే... ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందిందని చెప్పాడు. వన్డే ప్రపంచకప్‌ (2011) గెలిచిన రోజు ముంబైలో తన కారు టాప్‌పై అభిమానుల గంతులతో ఏర్పడిన సొట్టల్ని ‘హ్యాపీ డెంట్స్‌’గా అతను అభివర్ణించాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాఫర్‌

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ

చాంపియన్‌ కార్తీక్‌ సాయి

సింధు, శ్రీకాంత్‌లపైనే ఆశలు

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

బౌండరీలు కూడా సమానమైతే?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

ఆ విషయంలో ఇండియాదే పైచేయి.. కానీ!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హిమాన్షు, నమితలకు టైటిల్స్‌

ప్రణవ్‌ రామ్‌కు సింగిల్స్‌ టైటిల్‌

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా