ఫిఫాలో మరో అవినీతి కలకలం!

5 Jun, 2015 16:33 IST|Sakshi
ఫిఫాలో మరో అవినీతి కలకలం!

జ్యురిచ్: అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో అవినీతికి మరింత ఆజ్యం పోస్తూ తాజాగా బయటపడిన లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఫిఫా అధికారులు లంచాలు తీసుకుని పలు దేశాలకు ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన ఆరోపణలకు మరింత బలాన్నిస్తూ వెలుగుచూసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

2010వ సంవత్సరంలో ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్ లు తమ దేశంలో నిర్వహించేందుకు దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ అసోసియేషన్ భారీగా లంచాన్ని ఇవ్వజూపినట్లు తెలుస్తోంది . దీనిలో భాగంగానే దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డానీ జోర్డాన్ తమ దేశాన్ని బిడ్ రేస్ లో నిలిపేందుకు 10 మిలియన్ డాలర్లు లంచాన్ని ఎరవేస్తూ ఫిఫా అధికారులకు ఆ లేఖ రాసి ఉండవచ్చని యూఎస్ న్యాయవాదులు అనుమానిస్తున్నారు.

 

2018 (రష్యా), 2022 (ఖతార్) ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు ఆయా దేశాలకు దక్కేందుకు లంచాలు తీసుకున్నారనే కారణంతో ఫిఫా ఉపాధ్యక్షుడితో పాటు మరో ఆరుగురిని స్విట్జర్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు