హామిల్టన్‌ హవా

5 Aug, 2019 06:09 IST|Sakshi

హంగేరి గ్రాండ్‌ప్రిలో టైటిల్‌ సొంతం

బుడాపెస్ట్‌: మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ సీజన్‌లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో 70 ల్యాప్‌ల రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన అతను అందరికంటే ముందుగా గంటా 35 నిమిషాల 3.796 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కెరీర్‌లో తొలిసారి పోల్‌ పొజిషన్‌ సాధించిన రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ చివర్లో ఆధిక్యాన్ని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ డ్రైవర్‌ వెటెల్‌ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబర్‌ 1న జరుగుతుంది.  

మరిన్ని వార్తలు