టైటిల్‌ వేటకు వేళాయె...!  

17 Mar, 2019 01:40 IST|Sakshi

  ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో  హామిల్టన్‌ కు పోల్‌ పొజిషన్‌

నేటి నుంచి ఫార్ములావన్‌  సీజన్‌

మెల్‌బోర్న్‌: గతేడాది మాదిరిగానే ఈసారీ ఫార్ములావన్‌  సీజన్‌ తొలి గ్రాండ్‌ప్రి రేసులో ప్రపంచ చాంపియన్‌  లూయిస్‌ హామిల్టన్‌  ‘పోల్‌ పొజిషన్‌’ సాధించాడు. ఆదివారం జరిగే 2019 సీజన్‌  తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిని మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌  తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో ఈ బ్రిటన్‌  డ్రైవర్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 20.486 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్‌ రెండో స్థానం నుంచి... డిఫెండింగ్‌ చాంపియన్‌  సెబాస్టియన్‌  వెటెల్‌ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు.  
2019 ఫార్ములావన్‌  సీజన్‌లో ముగ్గురు కొత్త డ్రైవర్లు అరంగేట్రం చేయనున్నారు. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌ ), రసెల్‌ (విలియమ్స్‌), అలెగ్జాండర్‌ అల్బోన్‌  (ఎస్టీఆర్‌) ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో తొలిసారి బరిలోకి దిగనున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్‌ కిమీ రైకోనెన్‌  ఫెరారీ జట్టు నుంచి అల్ఫా రోమియో జట్టుకు మారాడు. తొమ్మిదేళ్ల తర్వాత రాబర్ట్‌ కుబికా పునరాగమనం చేయనున్నాడు. 

ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసు గ్రిడ్‌ పొజిషన్‌: 
1. హామిల్టన్‌  (మెర్సిడెస్‌), 2. బొటాస్‌ (మెర్సిడెస్‌), 3. వెటెల్‌ (ఫెరారీ), 4. వెర్‌స్టాపెన్‌  (రెడ్‌బుల్‌), 5. లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 6. గ్రోస్యెన్‌  (హాస్‌), 7. మాగ్నుసెన్‌(హాస్‌), 8. నోరిస్‌ (మెక్‌లారెన్‌ ), 9. రైకోనెన్‌  (అల్ఫా రోమియో), 10. పెరెజ్‌ (రేసింగ్‌ పాయింట్‌), 11. హుల్కెన్‌బర్గ్‌ (రెనౌ), 12. రికియార్డో (రెనౌ), 13.  అల్బోన్‌ (ఎస్టీఆర్‌), 14. గియోవినాజి (అల్ఫా రోమియో), 15. క్వియాట్‌ (ఎస్టీఆర్‌), 16. స్ట్రోల్‌ (రేసింగ్‌ పాయింట్‌), 17. గాస్లీ (రెడ్‌బుల్‌), 18. సెయింజ్‌ (మెక్‌లారె¯Œ ), 19. జార్జి రసెల్‌ (విలియమ్స్‌), 20. కుబికా (విలియమ్స్‌).  
 

ఉదయం గం. 10.35 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–2లో ప్రత్యక్ష ప్రసారం 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా