హామిల్టన్‌కు 87వ ‘పోల్‌’

28 Jul, 2019 05:31 IST|Sakshi

నేడు జర్మనీ గ్రాండ్‌ప్రి  

హాకెన్‌హీమ్‌ (జర్మనీ): ఈ సీజన్‌లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ నాలుగోసారి పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 11.767 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్‌ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా హామిల్టన్‌ కెరీర్‌లో ఇది 87వ పోల్‌ పొజిషన్‌ కావడం విశేషం. ఈ సీజన్‌లో పది రేసులు జరగ్గా... ఏడింటిలో హామిల్టనే విజేత. మరో రెండు రేసుల్లో మెర్సిడెస్‌ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్‌ నెగ్గగా... మరోదాంట్లో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ విజయం సాధించాడు. ఫెరారీ డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్‌ వెటెల్‌ తొలి క్వాలిఫయింగ్‌ సెషన్‌ను దాటలేకపోయాడు. ఆదివారం జరిగే రేసును అతను చివరిదైన 20వ స్థానం నుంచి మొదలు పెడతాడు.  

గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 3. బొటాస్‌ (మెర్సిడెస్‌), 4. పియరీ గాస్లీ (రెడ్‌బుల్‌), 5. రైకోనెన్‌ (అల్ఫా రోమియో), 6. గ్రోస్యెన్‌ (హాస్‌), 7. కార్లోస్‌ సెయింజ్‌ (మెక్‌లారెన్‌), 8. సెర్గియో పెరెజ్‌ (రేసింగ్‌ పాయింట్‌), 9. హుల్కెన్‌బర్గ్‌ (రెనౌ), 10. లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 11. గియోవినాజి (అల్ఫా రోమియో), 12. మాగ్నుసెన్‌ (హాస్‌), 13. రికియార్డో (రెనౌ), 14. క్వియాట్‌ (ఎస్టీఆర్‌), 15. లాన్స్‌ స్ట్రాల్‌ (రేసింగ్‌ పాయింట్‌), 16. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌), 17. అలెగ్జాండర్‌ ఆల్బోన్‌ (ఎస్టీఆర్‌), 18. జార్జి రసెల్‌ (విలియమ్స్‌), 19. రాబర్ట్‌ కుబికా (విలియమ్స్‌), 20. వెటెల్‌ (ఫెరారీ).
సాయంత్రం గం. 6.30 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షమీకి అమెరికా వీసా తిరస్కరణ, మంజూరు

జయహో... యు ముంబా

సెమీస్‌తో సరి

షూటింగ్‌ లేకుంటే... 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను బహిష్కరిద్దాం

నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు

గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్‌

పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా

ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ

బీసీసీఐ ప్రతిపాదనకు సీనియర్‌ క్రికెటర్‌ నో? 

టీమిండియాలో ప్రక్షాళన జరగాల్సిందే : మాజీ క్రికెటర్‌

స్టోక్స్‌కు ప్రమోషన్‌.. ఆర్చర్‌ అరంగేట్రం

లార్డ్స్‌ పిచ్‌పై రూట్‌ గరంగరం!

‘పెయిన్‌ కిల్లర్స్‌తోనే ప్రపంచకప్‌ ఆడాను’

మీలాంటి వాళ్లను క్రికెట్‌ ఆడకుండా చేసేవాడ్ని!

ఆమిర్‌ తొందరపడ్డాడు : వసీం అక్రం

రవిశాస్త్రి వైపే మొగ్గు?

'అస్సామి దాల్‌ వండడంలో తాను స్పెషలిస్ట్‌'

నదీమ్‌కు 10 వికెట్లు!

ఆసీస్‌ యాషెస్‌ జట్టు ఇదే..

భారత్‌ పోరాటం ముగిసింది..

మహ్మద్‌ షమీకి యూఎస్‌ వీసా నిరాకరణ

‘మ్యాచ్‌ విన్నర్లలో అతనిదే టాప్‌ ప్లేస్‌’

కాకినాడ కుర్రాడు వెస్టిండీస్‌ టూర్‌కు

బంగర్‌కు ఉద్వాసన..భరత్‌కు భరోసా!

చాంపియన్‌ ఆర్మీ గ్రీన్‌ జట్టు

బేస్‌బాల్‌ క్యాంప్‌నకు మనోళ్లు ముగ్గురు

అయ్యో... ఐర్లాండ్‌

టైటాన్స్‌ తెలుగు నేలపై చేతులెత్తేసింది..!

సింధు ఔట్‌.. సెమీస్‌లో ప్రణీత్‌

మలింగకు ఘనంగా వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దైవ రహస్యం

సరికొత్త కథతో...

ఇల్లు ఖాళీ చేశారు

మంచి నటుడు అనిపించుకోవాలనుంది

త్వరలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ స్టార్ట్‌

భారీ అయినా సారీ!