హామిల్టన్‌ హవా 

12 Jul, 2020 02:34 IST|Sakshi

కెరీర్‌లో 89వ పోల్‌ పొజిషన్‌ సాధించిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌

నేడు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసు

స్పీల్‌బర్గ్‌ (ఆస్ట్రియా): ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుత ప్రతిభతో అదరగొట్టడంలో తనకు ఎదురులేదని ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ నిరూపించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హామిల్టన్‌ అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును పోల్‌ పొజిషన్‌తో ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్‌ కెరీర్‌లో ఇది 89వ పోల్‌ పొజిషన్‌ కావడం విశేషం. క్వాలిఫయింగ్‌ చివరి సెషన్‌లో ల్యాప్‌ను ఒక నిమిషం 19.273 సెకన్లలో పూర్తి చేసిన హామిల్టన్‌ అగ్రస్థానాన్ని సంపాదించాడు. క్వాలిఫయింగ్‌ సెషన్‌ జరుగుతున్నంతసేపూ భారీ వర్షం కురిసింది. దాంతో డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇలాంటి స్థితిలోనూ హామిల్టన్‌ ఒత్తిడికి లోనుకాకుండా నియంత్రణతో డ్రైవింగ్‌ చేసి తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టాడు.  

గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 3. కార్లోస్‌ సెయింజ్‌ (మెక్‌లారెన్‌), 4. బొటాస్‌ (మెర్సిడెస్‌), 5. ఒకాన్‌ (రెనౌ), 6. నోరిస్‌ (మెక్‌లారెన్‌), 7. ఆల్బోన్‌ (రెడ్‌బుల్‌), 8. పియరీ గాస్లీ (అల్ఫా టౌరి), 9. రికియార్డో (రెనౌ), 10. వెటెల్‌ (ఫెరారీ), 11. లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 12. రసెల్‌ (విలియమ్స్‌), 13. స్ట్రోల్‌ (రేసింగ్‌ పాయింట్‌), 14. క్వియాట్‌ (అల్ఫా టౌరి), 15. మాగ్నుసెన్‌ (హాస్‌), 16. రైకోనెన్‌ (అల్ఫా రోమియో), 17. పెరెజ్‌ (రేసింగ్‌ పాయింట్‌), 18. నికోలస్‌ లతీఫి (విలియమ్స్‌), 19. గియోవినాజి (అల్ఫా రోమియో), 20. గ్రోస్యెన్‌ (హాస్‌). 

మరిన్ని వార్తలు