మరో టైటిల్పై హామిల్టన్ గురి

4 Sep, 2016 00:48 IST|Sakshi
మరో టైటిల్పై హామిల్టన్ గురి

నేడు ఇటలీ గ్రాండ్‌ప్రి రేసు 

 మోంజా (ఇటలీ): మూడు రేసుల తర్వాత మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూరుుస్ హామిల్టన్ మరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు క్వాలిఫరుుంగ్ సెషన్‌లో ఈ బ్రిటన్ డ్రైవర్ పూర్తి ఆధిపత్యం చలారుుంచాడు. అందరికంటే వేగంగా ఒక నిమిషం 21.135 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఏడో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం.

తాజా పోల్‌తో హామిల్టన్ ఇటలీ గ్రాండ్‌ప్రిలో అత్యధికంగా ఐదుసార్లు పోల్ పొజిషన్ పొందిన దిగ్గజాలు అయర్టన్ సెనా (బ్రెజిల్), యువాన్ మాన్యుయెల్ ఫాంగియో (అర్జెంటీనా) సరసన నిలిచాడు. ఈ సీజన్‌లో జరిగిన 13 రేసుల్లో ఆరింటిలో విజయం సాధించిన హామిల్టన్ మరో టైటిల్‌పై గురి పెట్టాడు. మెర్సిడెస్‌కే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.

గ్రిడ్ పొజిషన్‌‌స: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. రికియార్డో (రెడ్‌బుల్), 7. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 9. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 10. గుటిరెజ్ (హాస్), 11. మసా (విలియమ్స్), 12. గ్రోస్యెన్ (హాస్), 13. అలోన్సో (మెక్‌లారెన్), 14. వెర్లీన్ (మనోర్), 15. బటన్ (మెక్‌లారెన్), 16. సెరుుంజ్ (ఎస్టీఆర్), 17. క్వియాట్ (ఎస్టీఆర్), 18. నాసర్ (సాబెర్), 19. ఎరిక్సన్ (సాబెర్), 20. పాల్మెర్ (రెనౌ), 21. మాగ్నుసెన్ (రెనౌ), 22. ఒకాన్ (మనోర్).

నేటి ప్రధాన రేసు సా.గం. 5.25 నుంచి స్టార్ స్పోర్‌‌ట్స సెలెక్ట్ హెచ్‌డీ-2లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు