‘బహ్రెయిన్‌’  విజేత హామిల్టన్‌ 

1 Apr, 2019 01:20 IST|Sakshi

బహ్రెయిన్‌: నాటకీయంగా సాగిన బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రిలో డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ లూయీస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 1 గంట 34 నిమిషాల 21.29 సెకన్లలో హామిల్టన్‌ రేసును పూర్తి చేశాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్‌ రెండో స్థానంలో నిలిచాడు.

రేసు ఆరంభంనుంచి వేగంగా దూసుకుపోయి విజేతగా నిలుస్తాడని అనిపించిన చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ)ని దురదృష్టం వెంటాడింది. అతని కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 సీజన్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో బొటాస్‌ కొనసాగుతుండగా... తర్వాతి రేసు ఏప్రిల్‌ 12–14 మధ్య చైనా గ్రాండ్‌ ప్రి రేసు జరుగనుంది.  

మరిన్ని వార్తలు