హామిల్టన్‌ హవా

17 Sep, 2018 05:33 IST|Sakshi

సింగపూర్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం  

సింగపూర్‌: మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ సీజన్‌లో ఏడో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సింగపూర్‌ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ 61 ల్యాప్‌ల రేసును గంటా 51 నిమిషాల 11.611 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌)కు రెండో స్థానం, వెటెల్‌ (ఫెరారీ)కు మూడో స్థానం లభించాయి. ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లలో ఒకాన్‌ తొలి ల్యాప్‌లోనే వైదొలగగా... పెరెజ్‌ 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్‌లో 15 రేసులు పూర్తయ్యాక హామిల్టన్‌ 281 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది.  

మరిన్ని వార్తలు