విజేత హామిల్టన్‌..వ్యూహంతో కొట్టారు

4 Aug, 2019 22:02 IST|Sakshi

ఫార్ములా వన్‌ హంగేరి గ్రాండ్‌ప్రి

బుడాపెస్ట్‌ : ఆద్భుతమైన డ్రైవింగ్‌కు జట్టు (మెర్సిడెస్‌) వ్యూహం తోడవడంతో లూయిస్‌ హామిల్టన్‌ ఈ సీజన్‌లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన 70 ల్యాప్‌ల ప్రధాన రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన అతను అందరికంటే ముందుగా గంటా 35 నిమిషాల 3.796 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కెరీర్‌లో తొలిసారి పోల్‌ సాధించిన రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ చివర్లో ఆధిక్యాన్ని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో లెక్‌లెర్క్‌ (ఫెరారీ), ఐదో స్థానంలో కార్లో సెయింజ్‌ (మెక్‌లారెన్‌)లు రేస్‌ను ముగించారు. రేస్‌ను రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మరో మెర్సిడెస్‌ డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచాడు. 

వ్యూహంతో దెబ్బకొట్టారు.
వెర్‌స్టాపెన్‌ కళాత్మకమైన డ్రైవింగ్‌ డిఫెన్స్‌ను మెర్సిడెస్‌ తన వ్యూహంతో ఓడించింది. తొలి 35 ల్యాప్‌ల రేస్‌లో వెర్‌స్టాపెన్‌కు హామిల్టన్‌ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురవలేదు. అనంతరం దూకుడు పెంచిన హామిల్టన్‌ ల్యాప్‌ ల్యాప్‌కు వెర్‌స్టాపెన్‌తో ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ వచ్చి అతనిపై ఒత్తిడిని పెంచాడు. అయితే ఈ కుర్ర డ్రైవర్‌ డిఫెన్స్‌ డ్రైవింగ్‌ ముందు 5 సార్లు ఫార్ములావన్‌ డ్రైవర్‌ చాంపియన్‌ అయిన హామిల్టన్‌ పప్పులు ఉడకలేదు. దీంతో వ్యూహం మార్చిన మెర్సిడెస్‌ జట్టు హామిల్టన్‌ను 49వ ల్యాప్‌లో రెండో సారి పిట్‌లోకి పిలిచి కొత్త టైర్లను వేసి పంపింది. సరిగ్గా ఆ వ్యూహం రేస్‌ 67వ ల్యాప్‌లో ఫలితం చూపింది. అప్పటిదాకా ఆధిక్యంలో ఉన్న వెర్‌స్టాపెన్‌ను ఒవర్‌టేక్‌ చేసిన హామిల్టన్‌ రేస్‌ను ముగించాడు. డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్‌ 250 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబర్‌ 1న జరుగుతుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రవిశాస్త్రి ‘ట్రేసర్‌ బుల్లెట్‌’ వైరల్‌..!

‘మనసులో మాట.. ఆల్‌రౌండర్‌గా మారాలి’

బట్లర్‌ జెర్సీకి రూ. 61 లక్షల 30 వేలు

సాయిప్రణీత్‌ విరాళం రూ. 4 లక్షలు

అంతా బాగుంటే... ఆఖర్లో ఐపీఎల్‌: నెహ్రా

సినిమా

ఎల్లకాలం నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్‌ రన్నరప్‌

కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం

నిర్మాత కరీమ్‌కు కరోనా