చిట్టి మిథాలీకి కెప్టెన్‌ మిథాలీ ఆశీస్సులు..

11 Aug, 2017 10:39 IST|Sakshi
చిట్టి మిథాలీకి కెప్టెన్‌ మిథాలీ ఆశీస్సులు..
హైదరాబాద్‌: భారత మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చి అభిమానుల మనసులు గెలుచుకున్న కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ఓ చిట్టి  మిథాలీని ట్వీటర్‌ వేదికగా ఆశీర్వదించింది. ఇష్టమైన జాతీయ నాయకుల దుస్తులు ధరించాలి.. అనే స్కూల్‌ అసైన్‌మెంట్‌లో భాగంగా గురువారం ఓ చిన్నారి మిథాలీ జెర్సీ ధరించి ‘నేను మిథాలీ రాజ్‌ భారత మహిళల క్రికెట్‌ కెప్టన్‌ను’ అని తెలిపింది.
 
ఈ వీడియోను ఆ పాప తండ్రి ట్వీటర్‌లో మాకిష్టమైన నేషనల్‌ స్టార్‌ టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌. ఆమె నాకూతురికి ఆదర్శమని  పోస్టు చేశాడు. ఈ ట్వీట్‌కు మిథాలీ రాజ్‌ స్పందించింది.  ‘చిట్టి తల్లి తన జీవిత లక్ష్యాలన్ని సాధించాలని కోరుకుంటూ’  ఆశీర్వదించింది. మిథాలీ మహిళల వన్డే క్రికెటలో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వరుసగా ఏడు అర్ధ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌ఉమెన్‌ కూడా మిథాలీనే.