అద్భుతం : 30 ఏళ్ల నిరీక్షణకు తెర

26 Jun, 2020 08:38 IST|Sakshi

ఫుట్‌బాల్‌ చరిత్రలో గురువారం రాత్రి ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ను గెలవడం కోసం 30 ఏళ్లుగా నిరీక్షిస్తున్న లివర్‌పూల్‌ కల నెరవేరింది. గురువారం రాత్రి మాంచెస్టర్‌ సిటీతో జరిగిన మ్యాచ్‌లో చెల్సియా జట్టు 2-1 తేడాతో విజయం సాధించడంతో లివర్‌పూల్‌ మొదటిసారి ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. అయితే ఒక దశలో  జుర్గెన్ క్లోప్ ఆధ్వర్యంలోని లివర్‌పూల్‌ టైటిల్‌ గెలవడానికి మరో మ్యాచ్‌కోసం ఎదురుచూడాల్సి వస్తుందేమోనన్న అనుమానం కలిగింది. కానీ చెల్సియా జట్టులోని క్రిస్టియన్‌ పులిసిక్‌, విలియమ్‌ సీల్డ్‌ ఆఖరి నిమిషంలో గోల్స్‌ చేయడంతో చెల్సియా జట్టు 2-1 తేడాతో మాంచెస్టర్‌ సిటీని ఓడించింది. మరోవైపు మాంచెస్టర్‌ సిటీ నుంచి కెవిన్‌ డిబ్రూయిన్‌ ఒక​ గోల్‌ చేశాడు. (మైదానంలోకి రోహిత్‌ శర్మ)

ఈ విజయం చెల్సియాకు తరువాతి సీజన్లో జరగనున్న ఛాంపియన్స్ లీగ్‌లో స్థానం సాధించడంతో జట్టును మరింత బలోపేతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బ్లూస్(చెల్సియా) అభిమానులు ఈ ఫలితంతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు లివర్‌పూల్‌ క్లబ్‌ మొదటిసారి ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ గెలవడం వెనుక చెల్సియా మ్యాచ్‌ ఎంతగానో ఉపయోగపడిందని లివర్‌పూల్‌ అభిమానులు పేర్కొన్నారు. 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత వారి కల సాకారం అయినందుకు లివర్‌పూల్‌ క్లబ్‌ అభిమానులు ఆనందంగా ఉన్నారు. కాగా లివర్‌పూల్‌ తరువాతి మ్యాచ్‌లో మాంచెస్టర్‌ సిటీని ఎదుర్కోనుంది. గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ కింద ఈ మ్యాచ్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు