ఇక ఈడెన్లో 'గంట' మోగనుంది!

31 Jul, 2016 19:21 IST|Sakshi
2014లో లార్డ్స్ లో టెస్టు సందర్భంగా గంట కొడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ(ఫైల్)

కోల్కతా: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో గంట కొట్టిన తరువాత టెస్టు మ్యాచ్ను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగనన్నీ రోజులూ రెండు దేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్ గంట కొట్టి మ్యాచ్ను ఆరంభిస్తారు. ఇందుకు  పెవిలియన్ కు వెలుపల ఉండే బౌలర్ల బార్లో గంట వేలాడదీసి ఉంటుంది. అయితే ఈ తరహా పద్ధతిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మనసు పడ్డాడు. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో ఉన్న గంగూలీ.. త్వరలో నగరంలోని ఈడెన్ గార్డెన్లో లార్డ్స్ తరహా బెల్ ను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టాడు. వచ్చే సెప్టెంబర్లో ఈడెన్ గార్డెన్ గంటను  ఏర్పాటు చేయబోతున్నట్లు శనివారం స్పష్టం చేశాడు.

 

'అవును.. లార్డ్స్ తరహా గంటను ఈడెన్లో ప్రవేశపెట్టబోతున్నాం. మ్యాచ్ జరిగే ప్రతీ రోజూ ఇరు జట్లలోని మాజీ ఆటగాళ్లు గంటతో మ్యాచ్ ను ఆరంభిస్తారు. ఇప్పటికే గంటను కొనుగోలు చేశాం. సెప్టెంబర్లో అమర్చడానికి యత్నిస్తున్నాం' అని గంగూలీ తెలిపాడు. 2014వ సంవత్సరంలో లార్డ్స్ లో గంట కొట్టే అరుదైన అవకాశం గంగూలీకి దక్కిన సంగతి తెలిసిందే. 2014వ సంవత్సరంలో లార్డ్స్ లో గంట కొట్టే అరుదైన అవకాశం గంగూలీకి దక్కిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో గంగూలీ గంట కొట్టి మ్యాచ్ను ప్రారంభించాడు.
 

మరిన్ని వార్తలు