సఫారీ వన్డే జట్టు ఇదే..

25 Jan, 2018 15:26 IST|Sakshi

డర్బన్‌:టీమిండియాతో వన్డే సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. వన్డే జట్టులో టెస్టుల్లో ఆకట్టుకున్న పేసర్‌ లుంగీ ఎన్‌గిడికి చోటు కల్పిస్తూ సఫరీ సెలక్టర్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ప్రకటించిన 15 మందితో కూడిన వన్డే జట్టులో క్రిస్‌ మోరిస్‌, మోర్నీ మోర్కెల్‌లు తిరిగి చోటు దక్కించుకున్నారు. భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫిబ‍్రవరి 1వ తేదీ నుంచి ఆరు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది.  వన్డే సిరీస్‌లోనూ డు ప్లెసిస్‌ సారథిగా వ్యవహరిస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు స‍్పష్టం చేసింది.


దక్షిణాఫ్రికా వన్డే జట్టు:  డు ప్లెసిస్‌(కెప్టెన్‌), హషీమ్‌ ఆమ్లా, డీ కాక్‌, ఏబీ డివిలియర్స్‌, జేపీ డుమిని, ఇమ్రాన్‌ తాహీర్‌, మర్‌క్రామ్‌, డేవిడ్‌ మిల్లర్‌, మోర్నీ మోర్కెల్‌, క్రిస్‌ మోరిస్‌, ఎన్‌గిడి, ఫిహ్లుకోవా, రబడా, తబ్రైజ్‌ షమ్సి, జాండో

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు