విజేత మధురానగర్ షాట్స్

9 Mar, 2014 00:02 IST|Sakshi

ఇంటర్ క్లబ్ బ్మాడ్మింటన్ టోర్నీ
 జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ అంతర్ జిల్లా ఇంటర్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మధురానగర్ షాట్స్ జట్టు విజేతగా నిలిచింది. మధురానగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో 5 జిల్లాలకు చెందిన 13 క్లబ్‌లు పాల్గొన్నాయి.
 
 శనివారం జరిగిన ఈ పోటీల ఫైనల్లో మధురానగర్ షాట్స్ 3-0తో మధురానగర్-సీపై విజయం సాధించింది. వివేక్ (షాట్స్) 15-10, 15-9తో నవనీత్‌పై నెగ్గగా... సృష్టి (షాట్స్) 15-8, 15-10తో కేయూరపై గెలుపొందింది. అన ంతరం డబుల్స్ విభాగంలో ఏవీ రాజు-అనిల్ రెడ్డి జోడి (షాట్స్) 15-7, 15-6తో శేషాద్రి-రవి జంటను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో మధురానగర్-సి 3-1తో మధురానగర్-ఎపై, మధురానగర్ షాట్స్ 3-0తో సరూర్‌నగర్-బిపై గెలుపొందాయి. విజేతలకు హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు సోమరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు