40 ఫోర్లు, 15 సిక్సర్లతో ట్రిపుల్‌ సెంచరీ

7 Nov, 2019 10:13 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ ఘన విజయం

175 పరుగులకే డబ్ల్యూఎంసీసీ ఆలౌట్‌

హెచ్‌సీఏ రెండు రోజుల క్రికెట్‌ లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్‌ రెండు రోజుల లీగ్‌లో మహబూబ్‌నగర్‌ బ్యాట్స్‌మన్‌ జి. గణేశ్‌ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) దూకుడైన ట్రిపుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. గణేశ్‌ వీర విధ్వంసంతో బుధవారం డబ్ల్యూఎంసీసీతో ముగిసిన మ్యాచ్‌ లో మహబూబ్‌నగర్‌ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జట్టు 79.4 ఓవర్లలో 658 పరుగుల భారీస్కోరు సాధించింది. గణేశ్‌ విజృంభణకు తోడు అబిద్‌ (69 బంతుల్లో 110; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సెంచరీతో చెలరేగాడు. పి. హర్షవర్ధన్‌ (49; 9 ఫోర్లు), కేశవులు (78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో టైటస్‌ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యఛేదనలో డబ్ల్యూఎంసీసీ తడబడింది. బుధవారం ఇన్నింగ్స్‌ ప్రారంభించిన డబ్ల్యూఎంసీసీ 49.4 ఓవర్లలో కేవలం 175 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అక్షయ్‌ (28), హర్ష (28), శరత్‌ (28) పరవాలేదనిపించారు. మహబూబ్‌నగర్‌ బౌలర్లలో కయ్యుం 3, రుషేంద్ర 2 వికెట్లు దక్కించుకున్నారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మళ్లీ వెంకటేశ్వర్‌రెడ్డికే పగ్గాలు

నాణ్యమైన క్రికెటర్లుగా ఎదగాలంటే...

చివర్లో గోల్‌ సమర్పించుకొని...

పదికి పది వికెట్లు.. పది మెయిడెన్లు

సాయిప్రణీత్‌ శుభారంభం

గురి తప్పింది... కల చెదిరింది

మేఘమా ఉరుమకే...

ఆమే నా విమర్శకురాలు: రవిశాస్త్రి

దుమ్మురేపిన ‘దుర్గ’

బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు వాంతులు!

కోహ్లికి కోహ్లి రాయునది... 

మను... పసిడి గురి 

ఆసీస్‌ గెలిచేదాకా... స్మిత్‌ ధనాధన్‌ 

ఐదుగురు లిఫ్టర్లు డోపీలు

తప్పటడుగులతో కుప్పకూలిన ఇంగ్లండ్‌

సింధుకు చుక్కెదురు

నోబాల్‌ అంపైర్‌...

పవర్‌ ప్లేయర్‌ కాదు.. ఎక్స్‌ట్రా అంపైర్‌!

పాక్‌ను చెడుగుడాడుకున్న స్మిత్‌

రెండో పెళ్లి చేసుకున్న మాజీ కెప్టెన్‌

‘రవి మామా ఈ రోజు ఫుల్‌గా తాగుడేనా?’

ధోని సరికొత్త అవతారం

కోహ్లి భావోద్వేగ లేఖ: వాటికి సమాధానం నా దగ్గర లేదు

10 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు..

4,6,4,6,6... గౌతమ్‌ షో

నా విమాన ప్రయాణాన్ని అడ్డుకున్నారు: గేల్‌

రికార్డుల వీరుడు..శతకాల ధీరుడు!

‘ట్రాక్‌’ మార్చిన ద్యుతీచంద్‌

అత్యుత్తమ ర్యాంక్‌లో భారత టీటీ జట్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య