హైదరాబాద్‌కు వరుసగా నాల్గో పరాజయం

26 Feb, 2019 10:17 IST|Sakshi

7 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓటమి

 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ

సాక్షి, హైదరాబాద్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ రాత మారడం లేదు. పరాజయాల బాట వీడలేదు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 7 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓడింది. ఈ టోర్నీలో ఇప్పటికి ఇంకా బోణీ చేయని హైదరాబాద్‌ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయాన్నే చవిచూసింది. టాస్‌ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. మిడిలార్డర్‌లో రోహిత్‌ రాయుడు (34 బంతుల్లో 47 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించగా, సందీప్‌ 25, తన్మయ్‌ అగర్వాల్‌ 21 పరుగులు చేశారు.

ఎవరూ ధాటిగా ఆడలేకపోవడంతో వికెట్లున్నా జట్టు భారీస్కోరు చేయలేకపోయింది. మహారాష్ట్ర బౌలర్లలో విశాల్‌ గిటే 2, సమద్‌ ఫల్లా, సత్యజీత్, నౌషద్‌ షేక్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం సునాయాస లక్ష్యాన్ని మహారాష్ట్ర 18 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చగా... నౌషద్‌ షేక్‌ (29 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కెప్టెన్‌ త్రిపాఠి 16 పరుగులు చేసి సిరాజ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. హైదరాబాద్‌ బౌలర్లలో సాయిరామ్‌కు 2 వికెట్లు దక్కగా... సిరాజ్‌ ఒక వికెట్‌ తీశాడు.

స్కోరు వివరాలు
హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (సి) షేక్‌ (బి) విశాల్‌ గిటే 21; అక్షత్‌ రెడ్డి (స్టంప్డ్‌) నిఖిల్‌ (బి) షేక్‌ 8; రాయుడు (సి) హింగానెకర్‌ (బి) అజిమ్‌ కజి 15; రోహిత్‌ రాయుడు (నాటౌట్‌) 47; సందీప్‌ (ఎల్బీడబ్ల్యూ బి) సత్యజీత్‌ 25; ఆశిష్‌ రెడ్డి (బి) విశాల్‌ గిటే 6; సుమంత్‌ (సి) త్రిపాఠి (బి) సమద్‌ ఫల్లా 0; మిలింద్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 124.

వికెట్ల పతనం: 1–21, 2–44, 3–46, 4–93, 5–113, 6–116.

బౌలింగ్‌: విశాల్‌ గిటే 4–0–30–2, సమద్‌ ఫల్లా 4–0–29–1, సత్యజీత్‌ 4–0–19–1, నౌషద్‌ షేక్‌ 4–0–20–1, అజిమ్‌ కజి 3–0–19–1, హింగానెకర్‌ 1–0–6–0.  
మహారాష్ట్ర ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ (సి) సందీప్‌ (బి) సాకేత్‌ సాయిరామ్‌ 54; విజయ్‌ జోల్‌ (సి) సుమంత్‌ (బి) సాయిరామ్‌ 8; త్రిపాఠి (బి) సిరాజ్‌ 16; నౌషద్‌ షేక్‌ (నాటౌట్‌) 42, అజిమ్‌ కాజీ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 125.

వికెట్ల పతనం: 1–18, 2–60, 3–103.

బౌలింగ్‌: మెహదీ హసన్‌ 3–0–20–0, మిలింద్‌ 3–0–19–0, ఆశిష్‌ రెడ్డి 2–0–21–0, సాయిరామ్‌ 4–0–38–2, సందీప్‌ 2–0–8–0, సిరాజ్‌ 4–0–18–1.   

మరిన్ని వార్తలు